ఈ వెబ్సైటును వాడే ముందు తెలుసుకోవలసిన విషయాలు

ముఖ్యముగా, వ్యక్తిగత గోప్యత (Personal Privacy) గురించి తెలుసుకుందాం.

మీ సమస్యలను క్తపరుచుకోవాలన్నా, తెలుపుకోవాలన్నా మీ వివరాలు అవసరము.

  1. మీరు మీ సమస్యలను తెలుపుకునే ముందు, అందులో మీ “అసలు పేరు” (Real Name) ఉండడం అవసరమా లేదా ప్రశ్నిచుకోవాలె.
  2. ఒకవేళ అవసరము అనుకున్నప్పుడు, మీరు మీ ఇష్టానుసారముగా “మీ పేరును” వ్రాయవచ్చును.
  3. లేదా, మీ “అసలు పేరు” ను వ్రాయడానికి ఇష్టపడన్నప్పుడు ఒక “మారు పేరు” (Alias) ను ఎంచుకోవచ్చును.
  4. ఫోన్ నెంబర్ (Phone Number / WhatsApp Number), మీరు మీ సమస్యను వ్యక్తపరుచుకునే ముందు అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం అవసరమా లేదా అని ప్రశ్నించుకోవాలె.
  5. ఒక వేళ మీరు అవసరమనుకుంటే ఇవ్వండి – మీడియా లేదా సంబంధిత అధికారులు మరింత సమాచారం కోసం మీ ముందుకు రావచ్చు. మీరు మీ ఫోన్ నెంబర్ (Phone Number / WhatsApp Number) ఇచ్చినపుడు తగు జాగ్రత్తలు పాటించవలెను – ఎవరైనా కలవడానికి వస్తే, నలుగురి సమక్షంలో కలవండి, ఒంటరిగా ఎప్పుడు ఎవరిని కలువవద్దు.
  6. లేదా, మీ ఫోన్ నెంబర్ ను వ్రాయడానికి ఇష్టపడన న్నప్పుడు ఇవ్వనవసరమే లేదు.
  7. చివరిగా, మీరు ఎట్టి పరిస్థితులలో కూడా “తప్పుడు సమస్యను” (Falsified Problem) లేదా “తప్పుడు సమాచారాన్ని” (Falsified Information) ఈ వెబ్సైటులో చేర్చకూడదు. అది చట్ట రీత్యా నేరము. ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తే, మీరు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి అందుకు మీ పై చట్ట రీత్యా చర్యలు తీసుకునే అవకాశముంటుంది.

మీ సమస్యను “ఉన్నది ఉన్నట్లు” ఇతరులను విమర్శించకుండా “గౌరవ ప్రదంగా” వ్యక్తపరుచవలెను, అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం మొదలవుతుంది.

అవసరమైతే, పైన చెప్పబడిన విషయాలను మరొకసారి చదవండి.


SAMASYALU.COM – IS AN ONLINE WEB PORTAL, TOTALLY COMMITTED AND DEDICATED TO SERVE THE PEOPLE OF BOTH THE TELUGU STATES WITH ITS ALTRUISTIC VISION TO IMPROVE THE QUALITY OF OUR LIVES BY BRINGING OUR SOCIAL PROBLEMS TO EVERYBODY’S ATTENTION – WITHOUT ANY DISCRIMINATION.